సల్లూ భాయ్ మెచ్చిన చరణ్ స్టొరీ

సల్లూ భాయ్ మెచ్చిన చరణ్ స్టొరీ

Published on Jun 13, 2013 5:36 PM IST

ram-charan-teja_salman-khan
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి – బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మధ్య మంచి సత్సంబందాలు ఉన్నాయి. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా తనకు బాగా తెలుసు, అలాగే వారిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇక్కడ విషయం ఏమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా త్వరలోనే ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టనున్నాడు. ఓ ప్రముఖ వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన ‘జంజీర్’ స్టొరీ సల్మాన్ భాయ్ కి బాగా నచ్చిందని అంటున్నారు.

‘బాలీవుడ్లో స్నేహితులంటే సల్మాన్ ఖాన్ అనే చెప్పాలి. నాన్నకి ఆయని సత్సంబందాలు ఉన్నాయి. నాకు చాలా కాలంగా తెలుసు. నేను ఆయన్ని అన్నయ్యలా భావిస్తాను. నా బాలీవుడ్ మొదటి సినిమా ‘జంజీర్’ స్క్రిప్ట్ ని కూడా వినిపించాను, విని చాలా బాగుందని మెచ్చుకున్నారని’ చరణ్ అన్నాడు. బాలీవుడ్ సల్మాన్ భాయ్ నే మెప్పించిందంటే ఈ సినిమా ఫ్యాన్స్ కి పండగలా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ సినిమా ‘తుఫాన్’ పేరుతో తెలుగులో రానుంది.

తాజా వార్తలు