ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలో “బి ది రియల్ మ్యాన్” అనే ఛాలెంజ్ శరవేగంగా ఊపందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మన హీరోలు సహా దర్శక నిర్మాతలు కూడా కష్ట కాలంలో ఉన్నవారికి తమ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే విధంగా బాలీవుడ్ లో కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ ను అక్కడ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మొదలు పెట్టి తన ఉదారతను చాటుకున్నారు.
ఇప్పటికే సల్మాన్ అక్కడ బీయింగ్ సల్మాన్ పేరిట ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అలా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆహార కొరతతో బాధ పడుతున్న నిరుపేదలకు భారీ సహాయాన్ని అందించారు. మొత్తం 1 లక్ష 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి సల్మాన్ ఇప్పటి నుంచి ఇది కూడా ఒక ఛాలెంజే అని అందులో భాగమే ఈ “అన్న దానం” అంటూ ట్వీట్ చేసారు.