రామ్ ని పొగిడేసిన బాలీవుడ్ ఖాన్

రామ్ ని పొగిడేసిన బాలీవుడ్ ఖాన్

Published on Jun 30, 2013 5:00 PM IST

Salman-and-Ram
గత కొద్ది సంవత్సరాలుగా బాలీవుడ్ బాక్స్ ఆఫీసు ని షేక్ చేస్తున్న హీరో సల్మాన్ ఖాన్. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్స్ లో ఒకడైన సల్మాన్ భాయ్ ఇటీవలే అనుకోకుండా హైదరాబాద్ లో రామ్ ని కలిసారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన రాబోయే సినిమా ‘మెంటల్’ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నారు. రామ్ నటిస్తున్న ‘గోల్ మాల్’ సినిమా కూడా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అలా కొద్ది రోజుల క్రితం కలుసుకున్న వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. వీరిద్దరి మధ్యా మాటల్లో రెడీ సినిమాలో రామ్ నటనకు గాను సల్మాన్ ఖాన్ రామ్ ని తెగ పొగిడేసాడట. ఈ సినిమా హిందీ రీమేక్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. అది అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ‘ ఎట్టకేలకు వన్ అండ్ ఓన్లీ సల్మాన్ ఖాన్ ని కలుసుకున్నాను.. రెడీ సినిమాలో బాగా నటించానని ఆయన నాకు చెప్పారని’ రామ్ ట్వీట్ చేసాడు.

తాజా వార్తలు