టాలీవుడ్ రైటర్స్ వేటలో సల్మాన్ ఖాన్

Salman-Khan
ఇటీవల విడుదలైన ‘జై హో’ సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో దబాంగ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ నిర్ణయాన్ని తీసుకున్నాడు. సౌత్ ఇండియన్ రైటర్స్ ని బాలీవుడ్ కి తీసుకేళ్ళాలనే ఆలోచనలో ఉన్నాడు. గతంలో ఫ్లాపుల్లో ఉన్నప్పుడు చాలా తెలుగు సూపర్ హిట్ సినిమాలు సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ లో తిరిగి స్టార్డం ని తెచ్చిపెట్టాయి.

ఇప్పటి వరకూ సౌత్ ఇండియన్ సినిమాల రీమేక్ రైట్స్ తీసుకొని దాన్ని బాలీవుడ్ కి అనుగుణంగా మార్చుకొని సినిమాలు చేసిన సల్మాన్ ఇప్పుడు ఏకంగా ఇక్కడి రైటర్స్ ని తీసుకెళ్ళి సినిమాలు రాయించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మార్పులు చేర్పులు చేసే వాళ్ళ కంటే ఇక్కడి రైటర్స్ పనిచేస్తే ఒరిజినల్ ఫీల్ ఉంటుందని సల్మాన్ అనుకుంటున్నాడు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రవితేజ కిక్ సినిమా రీమేక్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

Exit mobile version