గబ్బర్ సింగ్ సన్నివేశాలను యాబై లక్షలకు కొన్న సల్మాన్ ఖాన్

గబ్బర్ సింగ్ సన్నివేశాలను యాబై లక్షలకు కొన్న సల్మాన్ ఖాన్

Published on May 25, 2012 2:51 PM IST


అవును మీరు సరిగ్గానే చదివారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” లో కొన్ని సన్నివేశాల హక్కులను బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ కొనుగోలు చేశారు. వీటి కోసం ఈయన యాబై లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఈ చిత్రంలో అంత్యాక్షరి సన్నివేశం, కట్ అవుట్ సన్నివేశం ఇంకా కబడ్డీ సన్నివేశాల హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ సన్నివేశాలను సల్మాన్ రాబోతున్న చిత్రం “దబాంగ్ -2” చిత్రంలో వాడుకోనున్నారు. ఈ సంఘటన సల్మాన్ లో వృత్తిపరమయిన గౌరవాన్ని తెలపడమే కాకుండా హరీష్ శంకర్ రాసిన సన్నివేశాల మీద ఇష్టాన్ని కూడా తెలుపుతుంది. ఈ మధ్య కాలంలో మొత్తం చిత్రాన్ని ఫ్రీమేక్ చేస్తున్నారు. ఇలాంటి కాలంలో సల్మాన్ ఇలా చెయ్యటం అయన వ్యక్తిత్వాన్ని చెబుతుంది. సల్మాన్,హరీష్ శంకర్ కి మా అభినందనలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు