బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాలపై పూర్తి ఆసక్తిని కనబరుస్తున్నారు. చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియన్ సినిమాల రీమక్ లతోనే సల్మాన్ ఖాన్ సూపర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సల్మాన్ తెలుగులో ఫేమస్ రైటర్ చెప్పిన కథని ఓకే చేసారని అంటున్నారు.
ఆ ఫేమస్ రైటర్ మరెవరో కాదు ఎస్ఎస్ రాజమౌళి ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్. విజయేంద్ర ప్రసాద్ ఓ పవర్ఫుల్ యాక్షన్ డ్రామా స్టొరీని సల్మాన్ కి చెప్పినట్లు, అది సల్మాన్ కి కూడా బాగా నచ్చినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకూ సల్మాన్ టీం నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇప్పటికే తెలుగు రైటర్ కోన వెంకట్ కి సల్మాన్ ఖాన్ తో మంచి రిలేషన్ ఉంది. విజయేంద్ర ప్రసాద్ కూడా త్వరలోనే ఆ సర్కిల్ లో చేరనున్నాడు. ఈ సినిమా స్టొరీ ఏదన్నా తెలుగు సినిమా రిమేక్ లేదా కొత్త స్టొరీ నా అనేది తెలియాల్సి ఉంది.