కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పూర్తి మాస్ యాక్షన్ మూవీ ‘సలార్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. మాస్ ఆడియెన్స్, యాక్షన్ లవర్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తూ ఈ మూవీ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లకు అభిమానులు ఫిదా అయ్యారు.
ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. తొలి భాగంలో ఆమె పాత్ర చుట్టూ కథ సాగుతుంది. ఇక ప్రేక్షకులందరూ ‘సలార్-2’ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, నేడు(జనవరి 28) పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రుతి హాసన్‌కు సలార్ మేకర్స్ తాజాగా విషెస్ అందజేశారు. సలార్ చిత్రంలో ఆమె చేసిన ఆద్య పాత్రకు సంబంధించి ఓ పోస్టర్‌తో వారు ఈ విషెస్ అందజేశారు.
ఆద్యకు బర్త్ డే విషెస్ చెప్పిన సలార్ టీమ్.. ఆమెను తిరిగి సెట్స్‌లో చూడాలని ఆతృతగా చూస్తున్నట్లు.. ఆమె త్వరగా రావాలంటూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక సలార్-2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Here’s wishing our coolest Aadya, @shrutihaasan a very Happy Birthday. ????❤️
Excited for Shouryaanga Parvam and to see you back on the sets of #Salaar2! pic.twitter.com/tE6zEUHDj0
— Salaar (@SalaarTheSaga) January 28, 2025