‘రేయ్’ విషయంలో ఆసక్తిగా ఉన్న సయామీ ఖేర్

Saiyami-Kher
ఇలియానా, అంకిత, రామ్, ఆదిత్య ఓం మరియు వెంకట్ లాంటి నూతన తారలను టాలీవుడ్ కి పరిచయం చేసిన వైవిఎస్ చౌదరి ‘రేయ్’ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ – సయామీ ఖేర్ లను పరిచయం చేయనున్నాడు. మ్యూజికల్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీలో శ్రద్దా దాస్ మరో హీరోయిన్ గా కనిపించనుంది.

సయామీ ఖేర్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ ‘ ఈ సినిమా కోసం పనిచేయడం గొప్ప అనుభవం. ట్రినిడాడ్ – టొబాగో, యుఎస్, బ్యాంకాక్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా షూట్ చేసాం. నా డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడంలో, ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో నా టీం చాలా బాగా సపోర్ట్ చేసారు. సాయి ధరమ్ తేజ్ సూపర్బ్ డాన్సర్, అతనితో డాన్స్ వేయడానికి నేను చాలా కష్టపడ్డాను. నా మొదటి సినిమా విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నానని’ తెలిపింది.

చక్రి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో జనవరి 17న పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. అలాగే సినిమా ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version