గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్న బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ ఈ రోజు అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. వీరు చాలా సింపుల్ గా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్ళికి సాక్షులుగా సైఫ్ అమ్మ గారు షర్మిల టాగూర్ మరియు కరీనా కపూర్ తల్లి తండ్రులైన రంధీర్ కపూర్ మరియు బబితా కపూర్ హాజరయ్యారు. సైఫ్ – కరీనా 2007 నుంచి ప్రేమలో ఉన్నారు.
ఈ పెళ్లికి సైఫ్ సింపుల్ గా కుర్తాలో రాగా, కరీనా గ్రీన్ సల్వార్ డ్రెస్లో వచ్చింది. బంధు మిత్రులకు మరియు ఇండస్ట్రీ వారికి ఈ రోజు సాయంత్రం ముంబైలో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నూతన వధూవరులు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాం.