ఇడియట్ లో రవితేజ పాత్రలా ఉంటుంది – సాయిరాం శంకర్

ఇడియట్ లో రవితేజ పాత్రలా ఉంటుంది – సాయిరాం శంకర్

Published on Sep 13, 2013 8:30 AM IST

Sairam-Shankar
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడిగా కొద్ది రోజులు దర్శకత్వ శాఖలో పని చేసిన సాయిరాం శంకర్ ఆ తర్వాత హీరోగా మారాడు. సాయిరాం శంకర్ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ ‘ జయాపజయాలతో సంబంధం లేకుండా నాకు ప్రేక్షకుల్లో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. ‘1000 అబద్దాలు’ సినిమా చూసిన వారంతా నా పాత్ర చాలా బాగుందని మెచ్చుకున్నారు. ప్రస్తుతం 2 సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. అందులో మొదటిది ‘రోమియో’. ఇడియట్ లో రవితేజ పాత్ర ఎలా ఉంటుందో రోమియోలో నా పాత్ర కూడా అలా ఉంటుంది. అలాగే ‘దిల్లున్నోడు’ కూడా పూర్తి అయ్యింది. త్వరలోనే ఈ సినిమాల ఆడియో రిలీజ్ చేయనున్నాం. అలాగే ప్రస్తుతం విజయమే లక్ష్యంగా పని చేస్తున్నానని’ అన్నాడు.

సాయిరాం శంకర్ అనుకున్నట్టుగానే అతనికి త్వరలోనే విజయం వరించాలని కోరుకుంటూ అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు