చిరు “వేదాళం” రీమేక్ లో సాయి పల్లవి కీ రోల్?

చిరు “వేదాళం” రీమేక్ లో సాయి పల్లవి కీ రోల్?

Published on Sep 12, 2020 7:24 PM IST


లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా గుండు లుక్ లో ఉన్న ఒక ఫోటోను పెట్టి షాకిచ్చారు. దీనితో ఈ ఫొటోకు గాను భారీ రెస్పాన్స్ రావడంతో పాటుగా అనేక రకాల స్పెక్యులేషన్స్ కూడా మొదలయ్యాయి. చిరు తాను నటించబోయే రెండు రీమేక్ చిత్రాల్లో ఒకటైన “వేదాళం” కోసమే ప్లాన్ చేస్తున్నారని టాక్ మొదలయ్యింది. దీనితో బహుశా “ఆచార్య” చిత్రం తర్వాత ఈ సినిమానే మొదలు కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి మరో బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో లేటెస్ట్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఒక కీ రోల్ చేయనున్నట్టు టాక్ బయటకు వచ్చింది. వేదాళం ఒరిజినల్ వెర్షన్ లో అజిత్ కు చెల్లెలి పాత్ర ఎంత కీలకంగా రన్ అవుతుందో తెలిసిందే. ఇపుడు ఈ రోల్ కు గాను సాయి పల్లవి పేరు చిత్ర యూనిట్ అనుకుంటున్నారని సినీ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు