మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే మూవీతో సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడు. ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ వసూళ్లు కొట్టిన ఆ మూవీ 2019ని ఘనంగా ముగించింది.దర్శకుడు మారుతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులకు ఫుల్ ఖుషి చేశారు. ఆ మూవీ తరువాత సాయి ధరమ్ సోలో బ్రతుకే సో బెటర్ అనే ఓ చిత్రాన్ని కమిటయ్యారు. ఆ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
కాగా కొద్దిరోజుల క్రితం సోలో బ్రతుకే సో బెటర్ మూవీ నుండి ‘నో పెళ్లి..’ అనే సాంగ్ విడుదలైంది. సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న ఆ పాటను ఆర్వీ అనే ఓ క్యూట్ గర్ల్ అద్భుతంగా చేసి మెప్పించింది. సదరు వీడియో ట్విట్టర్ లో పంచుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ బేబీని పొగిడేశాడు. ఎస్ వి సి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు.
This lil princess stole our hearts ❤️❤️❤️…thank you Aarvi ????????…may god bless you with loads of love https://t.co/lQLBYhmiei
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 19, 2020