డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి తీసిన ‘సాహసం’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుందని ఆశిస్తున్న ఈ సినిమాలో గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు సినిమా మిస్ అయిన దాన్ని చూపించనున్నారు. తాజాగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అవి ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తాయని అంటున్నారు. హీరో గోపీచంద్, చంద్రశేఖర్ యేలేటి సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విజువల్ ఎఫెక్ట్స్ గురించే మాట్లాడుతున్నారు.
గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గుల్షన్ గ్రోవర్ పాకిస్థాన్ సైనిక నాయకుడిగా కనిపించనున్నాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ప్రస్తుతం విజయాలు లేక డీలా పడిన గోపీచంద్ ఈ సినిమా విజయంపైనే తన ఆశలన్నీ పెట్టుకొని ఉన్నాడు.