చంద్రశేఖర్ యేలేటి తాజా చిత్రం ‘సాహసం’కు ప్రేక్షకులనుండి మంచి స్పందన వచ్చింది. అంతేకాక గోపీచంద్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత.
ఈ సినిమా ప్రధాన తారలు, నిర్మాత మరియు పాటల రచయిత అనంత శ్రీరాం ఈరోజు వారి విజయానందాన్ని పంచుకోవడానికి మీడియాతో జతకలిసారు. ఈ సినిమా గురించి గోపీచంద్ మాట్లాడుతూ “ఈ సినిమా విజయం సాధించాడానికి కారణం మా చిత్ర బృందం యొక్క సమిష్టి కృషి అని తెలిపాడు. వారివారి విభాగాలలో అత్యున్నతంగా రాణించడం వలనే ఇంత మంచి సినిమా వచ్చిందన్నారు. నా గత సినిమా విడుదలై దాదాపు ఏడాదిన్నర కావచ్చింది. ఈ ‘సాహసాన్ని’ ఎలా స్వీకరిస్తారా అని భయపడ్డాను. నాకీ అవకాసం ఇచ్చినందుకు చంద్రశేఖర్ యేలేటి మరియు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ లకు నా కృతజ్ఞతలు”అని తెలిపాడు.
ఈ సినిమా విజయంతో ఆనందంలో వున్న తాప్సీ “నాకు లభించిన మొదటి సోలో హిట్ సాహసం. నేను చాలా ఆనందంగా వున్నాను. ఈ సినిమాను నేను అంగీకరించడానికి కారణం దర్శకుడు. ఆయనతో కలిసి మరోసారి పనిచెయ్యడానికి నేను సిద్ధం”అని తెలిపింది. శాందత్ సినిమాటోగ్రాఫర్. శ్రీ సంగీతాన్ని అందించాడు