సింగరేణి నేప‌థ్యంలో సాగర్ పాన్ ఇండియా చిత్రం – నవంబర్ నుండి షూటింగ్

సింగరేణి నేప‌థ్యంలో సాగర్ పాన్ ఇండియా చిత్రం – నవంబర్ నుండి షూటింగ్

Published on Oct 3, 2025 7:00 AM IST

Sagar

‘ది 100’ సినిమా తర్వాత హీరో సాగర్ ఇప్పుడు మరో వినూత్న చిత్రంతో రానున్నారు. స్వయంగా సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చిన ఆయన, వారి కష్టసుఖాల కథను తెరపై చూపించేందుకు ముందడుగు వేశారు.

ఈ చిత్రాన్ని ‘జార్జి రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో కార్మికుల జీవనశైలీ, త్యాగాలు, పోరాటాలు, అనుబంధాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. భారీ అండర్‌గ్రౌండ్ కోల్ మైన్ సెట్స్ నిర్మించి, సహజత్వానికి దగ్గరగా చిత్రీకరించనున్నట్టు టీమ్ తెలిపింది.

దసరా సందర్భంగా ఈ మూవీని అధికారికంగా ప్రకటించగా, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోని నటులతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక ప్రముఖ స్టార్ హీరో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

తాజా వార్తలు