ఒక్క ఈవెనింగ్ షో నుంచి 5000 షోస్ వరకు రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్!

ఒక్క ఈవెనింగ్ షో నుంచి 5000 షోస్ వరకు రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్!

Published on Oct 3, 2025 11:30 AM IST

rishab-shetty

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్న అవైటెడ్ చిత్రమే “కాంతార 1”. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం వాటిని రీచ్ అయ్యి సాలిడ్ వసూళ్లు అందుకునే దిశగా వెళుతుంది. టాలెంటెడ్ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ తో తాను అందరికీ సోషల్ మీడియాలో తన ధన్యవాదాలు షేర్ చేసుకుంటున్నాడు.

అయితే 2016లో తాను ఎదుర్కొన్న సంఘటన నుంచి ఇప్పుడు వరకు తన జర్నీ ఎలా ఉందో ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలిపాడు. 2016లో చేసిన ఓ పోస్ట్ ని వెతికి మరీ పెట్టి అప్పుడు తన సినిమాకి సాయంత్రం ఒక్క షో దొరికితే చాలు అనుకున్నాను కానీ ఇప్పుడు నా సినిమాకి 5000 వేల హౌస్ ఫుల్ షోస్ పడటం అనేది ఎంతో ఆనందంగా అంతే భావోద్వేగంగా ఉందని ఇదంతా మీ అందరి ప్రేమ ఆ దేవుని కృప అంటూ పోస్ట్ చేసాడు. దీనితో తన సక్సెస్ జర్నీ పై ఎమోషనల్ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.

తాజా వార్తలు