పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఇపుడు 300 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. అయితే యూఎస్ మార్కెట్ లో మాత్రం ఓజి మంచి స్టడీ హోల్డ్ తో దూసుకెళ్తుంది అని చెప్పాలి.
అక్కడ ఆల్రెడీ 5 మిలియన్ డాలర్స్ మార్క్ దాటేసిన ఈ సినిమా ఇప్పుడు 5.3 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటి స్టడీ పెర్ఫామెన్స్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ వీకెండ్ కి లెక్క మరింత ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఈ చిత్రానికి ఉంది. మరి ఫైనల్ రన్ లో ఓజి ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
#TheyCallHimOG North America gross at $5.3M+ and counting… ❤️????❤️????❤️???? #BlockBusterOG Running successfully in cinemas near you. ????????????https://t.co/MSpn6ryrw8 ???? Book your tickets here #BoxOfficeDestructorOG #OG North America release by @PrathyangiraUS pic.twitter.com/PUnDf3XhtX
— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 2, 2025