స్మాల్ స్క్రీన్ పై “సాహో” స్ట్రామ్ రెడీ.!

స్మాల్ స్క్రీన్ పై “సాహో” స్ట్రామ్ రెడీ.!

Published on Oct 11, 2020 9:00 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సాహో”. ప్రభాస్ నుంచి బాహుబలి తర్వాత ప్లాన్ చేసిన పాన్ ఇండియన్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అలా చాలా విరామం తర్వాత విడుదల కాబడ్డ ఈ చిత్రం నెగిటివ్ టాక్ తోనే ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే ఈ సినిమా మాత్రం అప్పటి నుంచి మాత్రం ఇంకా టెలివిజన్ స్క్రీన్ పై వచ్చింది లేదు. హిందీలో అయితే టెలికాస్ట్ అయ్యింది కానీ తెలుగు వెర్షన్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

కానీ ఇన్నేళ్ల నిరీక్షణకు ఇపుడు జీ తెలుగు వారు తెర దించారు. వారు ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ 18న సాయంత్రం 4:30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యనున్నారు. మరి ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “సాహో” స్ట్రామ్ తెలుగు స్మాల్ స్క్రీన్ పై ఏ స్థాయిలో టీఆర్పీ రాబడుతుందో చూడాలి.

తాజా వార్తలు