ఆగష్టు రెండవ వారంలో ఎన్.టి.ఆర్ మూవీ ఆడియో?

ఆగష్టు రెండవ వారంలో ఎన్.టి.ఆర్ మూవీ ఆడియో?

Published on Jul 14, 2013 9:30 AM IST

Ramayya-Vasthayya
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా సమంత, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ మూవీలో చాలా కాలం తర్వాత ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అలాగే డైలాగ్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అవుతాయని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అంచనాలాను మరింత పెంచేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని ఆగష్టు రెండవ వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు. కొద్ది రోజుల క్రితం మైసూర్, పొల్లాచి లలో షూటింగ్ జరుపుకోగా, ఇటీవలే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ – సమంత లపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో షూట్ చేసారు. ఎస్ఎస్ థమన్ సంగీత సారధ్యంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు