కమల్ హాసన్ చేతుల మీదుగా ఋషి ఆడియో ఆవిష్కరణ

కమల్ హాసన్ చేతుల మీదుగా ఋషి ఆడియో ఆవిష్కరణ

Published on Jan 30, 2012 12:26 PM IST


ప్రసాద్ ప్రొడక్షన్స్ వారు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘ఋషి’ అనే చిత్రం తీసారు. ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న ప్రసాద్ మల్టిప్లెక్స్ థియేటర్లో విలక్షణ నటుడు కమల్ హాసన్ మరియు మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు గారి చేతుల మీదుగా విడుదల చేసారు. కమల్ హాసన్ ఆడియో ఆవిష్కరించి మొదటి సీడీని రామానాయుడు గారికి అందించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ప్రసాద్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఏక్ దుజేకేలియే’ చిత్రంతోనే నేను బాలీవుడ్ కి పరిచయమయ్యాను.

నేను నటించిన ‘అమావాస్య చంద్రుడు’ చిత్రంలో ఎల్వీ ప్రసాద్ గారిని ఒక పాత్ర చేయమని కోరాను. స్క్రిప్ట్ రైటర్ రాస్తే తప్పకుండ చేస్తా అన్నారు. అన్నట్లుగానే ఒక చిన్న పాత్ర పోషించారు. ఈ సంస్థతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది అన్నారు. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధించాలని రామానాయుడు ఆకాంక్షించారు. ఎల్వీ ప్రసాద్ గారి కొడుకు ప్రసాద్ సంస్థల అధినేత అయిన రమేష్ ప్రసాద్ గారు మాట్లాడుతూ మా సంస్థ ఎదుగుదలలో కమల్ హాసన్ లాంటి వారి గొప్ప నటుల పాత్ర ఉండటం ఆనందంగా ఉందన్నారు.

మేము అడగగానే ఈ వేడుకకు వచ్చినందుకు కమల్ హాసన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ ఫేం అరవింద్ కృష్ణ హీరోగా నటించగా సుప్రియ శైలజా హీరొయిన్ గా నటించారు. స్నిగ్ధ-డాన్ చంద్రన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు