రేపే ‘రన్ రాజా రన్’ ఫస్ట్ లుక్

Sharwanand
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘రన్ రాజా రన్’ సినిమా ఈ సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజీత్ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమా షూటింగ్ కొంతవరకూ పూర్తయ్యింది. ఈ సినిమాలోని ఎక్కువభాగం హైదరాబాద్, గోవాలలో షూట్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాది కానుకగా రేపు రిలీజ్ చేయనున్నారు.

సుజీత్ తన మొదటి ఫీచర్ ఫిల్మ్ గా తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ స్టైలిష్ లుక్ లో ఒక దొంగగా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాతో సీరత్ కపూర్ హీరోయిన్ గా పరిచయం కానుంది.

గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మధి సినిమాటోగ్రాఫర్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ – ప్రమోద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శర్వానంద్ ప్రస్తుతం ఈ సినిమా కాకుండా క్రాంతి మాధవ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Exit mobile version