ప్రభాస్ ‘రాధే శ్యామ్’ పై అవి రూమర్సే !

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. అయితే ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ క్లాసికల్ డాన్సర్ గా కనిపించనుందని, ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉండేలా ఆమె గెటప్ ను డిజైన్ చేశారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కేవలం అవి పుకార్లు మాత్రమేనని మేకర్స్ చెప్పారు.

ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కూడా రెండు గెటప్స్ లో కనిపిస్తారట. రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ సినిమా అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాగా ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాడట ప్రభాస్. అందుకే ఈ లాక్ డౌన్ లో స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని ఇప్పటికే దర్శకుడికి చెప్పినట్లు.. ఆ దిశగా రైటర్స్ చేత స్క్రిప్ట్ వర్క్ కూడా చేయించిన్నట్లు తెలుస్తోంది. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Exit mobile version