యాక్షన్ ఓరియెంటడ్ చిత్రంలో త్రిష

యాక్షన్ ఓరియెంటడ్ చిత్రంలో త్రిష

Published on Dec 25, 2012 2:50 AM IST

Trisha_rest
ఎం ఎస్ రాజు దర్శకత్వంలో “RUM” అనే చిత్రం రానుంది అని ఇదివరకే చెప్పాము ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు,తమిళ మరియు కన్నడలలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో త్రిష,అర్చన మరియు పూర్ణ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రంలో పోలిసుగా కాని యువరాణి గా కాని కనిపించడం లేదని త్రిష దృవీకరించారు. ఈ చిత్రం గురించి ఆమె మరికొన్ని విశేషాలను వెల్లడించారు. ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ ఈ చిత్రం యాక్షన్ ఓరియెంటడ్ చిత్రం అని విజయ్ మాస్టర్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షించనున్నారని తెలిపారు. ఈ చిత్ర జనవరిలో మొదలు కానుంది ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఎం ఎస్ రాజుని కలిసి త్రిష మరిని విశేషాలను తెలుసుకోనున్నారు. ఈ చిత్రం ఎలా ఉంటుంది అని ఇప్పుడే ఊహించలేము కాని హాలివుడ్ లో చార్లీస్ ఏంజల్స్ లాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మన ఊహ నిజమో కాదో త్వరలో తెలిసిపోతుంది.

తాజా వార్తలు