‘కాంచన’ కాంబినేషన్ మరోసారి

‘కాంచన’ కాంబినేషన్ మరోసారి

Published on Feb 5, 2021 11:19 PM IST


రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి నటుడు, దర్శకుడు కూడ. ఆయన సినిమాలంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం. హర్రర్ జానర్లో లారెన్స్ తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. ‘ముని, కాంచన, కాంచన 2’ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు అదే స్టైల్లో ‘రుద్రన్’ అనే కొత్త సినిమా చేస్తున్నారు ఆయన. అయితే ఈసారి దర్శకుడు మాత్రం వేరొకరు.

ప్రముఖ నిర్మాత కార్తిరేసన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో లారెన్స్ తో పాటు ప్రముఖ నటుడు శరత్ కుమార్ నటిస్తున్నారు. శరత్ కుమార్ 2011లో వచ్చిన ‘కాంచన’ చిత్రంలో ట్రాన్స్ జెండర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఏ నటుడూ చేయని పాత్రను చేసి ఎవరికీ దక్కని క్రెడిట్ దక్కించుకున్నారు. 11 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. మరి ఈ సినిమాలో శరత్ కుమార్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2021లోనే రిలీజ్ చేయనున్నారు. లారెన్స్ జోడీగా ప్రియ భవానీ శంకర్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు