మన ఇండియాలోనే బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్ నమోదు చేసుకున్న టాలీవుడ్ చిత్రం “RRR”. యంగ్ టైగర్ నాత్ర మరియు రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి చేస్తున్న ఈ మహా యాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ చిత్ర యూనిట్ నుంచి ఒక అధికారిక అప్డేట్ వచ్చి కూడా చాలా కాలం అయ్యింది.
అలా ఇప్పుడు ఈ చిత్రం షూట్ పునః ప్రారంభం కావడంతో ఇన్నాళ్లు ఎదురు చూస్తున్న ఖుషీ చేస్తామని తెలుపుతూ హింట్ ఇచ్చారు. ఇపుడు ఆ అప్డేట్ ఎప్పుడు రివీల్ చేస్తారో కూడా టైం తెలిపారు. ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆ అప్డేట్ ఏంటి అన్నది రివీల్ చేస్తామని తెలిపారు. మరి వీరు ఎలాంటి విషయాన్ని వెల్లడిస్తారా అని చరణ్ అభిమానులు మరియు తారక్ అభిమానులు అమితంగా ఎదురు చూస్తున్నారు.
An update you all have been waiting for will be out at 10:30 AM today. Stay tuned. #WeRRRBack ????????@tarak9999 @AlwaysRamCharan @ssrajamouli @ajaydevgn @aliaa08 @oliviamorris891 @dvvmovies #RRRMovie #RRR
— RRR Movie (@RRRMovie) October 6, 2020