“RRR” షూట్ మొదట ఈ హీరోతోనేనా.!

“RRR” షూట్ మొదట ఈ హీరోతోనేనా.!

Published on Sep 6, 2020 3:04 PM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న భారీ పీరియాడిక్ వండర్ “RRR” కోసం ఇండియన్ ఫిల్మ్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ వల్ల కొంత కాలం విరామం తర్వాత ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ పునః ప్రారంభం కానుంది. అయితే ఈ షూట్ లో మొదట ఎవరి మీద మొదట షూట్ తో మొదలయ్యే అవకాశం ఉంది అంటే తారక్ తోనే అని చెప్పొచ్చు.

కేవలం తారక్ మీద ప్లాన్ చేసే టీజర్ కోసం అనే కాకుండా మరో మెయిన్ లీడ్ లో కూడా కనిపించనున్న రామ్ చరణ్ కూడా ఈ చిత్రం కంటే ముందు కొరటాల మరియు చిరు కాంబోలో తెరకెక్కనున్న “ఆచార్య” షూట్ నే పూర్తి చెయ్యాలని అనుకుంటున్నారు. ఆ లెక్కన జక్కన్న మొదటగా కొమరం భీం ఎన్టీఆర్ తోనే తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా జక్కన్న ప్లానింగ్ ప్రకారం ఈ ఏడాదిలోనే తారక్ మీద టీజర్ వచ్చేసినా ఆశ్చర్యం లేకపోవచ్చు.

తాజా వార్తలు