ఆర్ఆర్ఆర్’. షూట్ స్టార్ట్.. ఎన్టీఆర్ పై సోలో షాట్స్ !

ఆర్ఆర్ఆర్’. షూట్ స్టార్ట్.. ఎన్టీఆర్ పై సోలో షాట్స్ !

Published on Oct 5, 2020 11:21 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ రోజు నుండి ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ సెట్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ షూటింగ్ లో ముందుగా జాయిన్ అయ్యారట. ఎన్టీఆర్ పై సోలో షాట్స్ తీయనున్నారు. దసరాకి తారక్ పాత్ర మీద జక్కన్న ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేయనున్నాడు. గత కొన్ని నెలలుగా ఈ వీడియో కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక నిర్మాత డివివి దానయ్య సెట్స్‌ పై కఠినమైన చర్యలు పాటించేలా చూసుకోనున్నారు. ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు