ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ లోనే ఆ హింట్ ఉందట..!

ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ లోనే ఆ హింట్ ఉందట..!

Published on May 2, 2020 10:24 AM IST

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మే 30కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఆర్ ఆర్ ఆర్ నుండి కొమరం భీమ్ గా రాజమౌళి ఎన్టీఆర్ ని పరిచయం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో మరి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో ఎలా ఉంటుంది. ఆయనను ఎలా పరిచయం చేస్తారు… ఇలా అనేక అనుమానాలు అభిమానులలో ఉన్నాయి. ఐతే ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ వీడియో ఎలా ఉంటుంది అని కీరవాణిని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పారు.

ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ లోనే ఎన్టీఆర్ ఇంట్రో వీడియోకి సంబందించిన హింట్ ఉందట. ఆ మోషన్ పోస్టర్ చూసి మీరు అర్థం చేసుకో గలిగితే మే 20న రానున్న ఎన్టీఆర్ ఫస్టల్ లుక్ వీడియో ఎలా ఉంటుందో అర్థం అవుతుందని కీరవాణి చెప్పుకొచ్చారు. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉన్న కీరవాణి ఆర్ ఆర్ ఆర్ కి కూడా మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు