రికార్డు ధరకి ఆర్ ఆర్ ఆర్ కృష్ణ థియరిటికల్ రైట్స్

ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉంది. అప్పుడే ఈ చిత్ర రికార్డుల ప్రభంజనం మొదలైపోయింది. ఈ చిత్రాన్నికి ఉన్న హైప్ రీత్యా రికార్డు ధరలు చెల్లించి థియరిటికల్ రైట్స్ దక్కించుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ కృష్ణ డిస్ట్రిక్ట్ థియరిటికల్ రైట్స్ ఏకంగా 16 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇది ఆల్ టైం టాప్ ప్రైస్ కావడం గమనార్హం. ఇక నైజాంలో కూడా ఆర్ ఆర్ ఆర్ థియరిటికల్ రైట్స్ 75కోట్లు పలికాయి. అలాగే నెల్లూరు 10 కోట్లు, కర్ణాటక 50కోట్లకు ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శన హక్కులను అమ్మడం జరిగింది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్ర తాజా షెడ్యూల్ కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రారంభించారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ 2020జులై 30 నుండి 2021 జనవరి 8కి వాయిదావేశారు.

Exit mobile version