రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడగా…సడలింపులు అనంతరం షూటింగ్ మొదలుపెట్టాలని ఆయన భావించారు. దీనికోసమే ఆయన హైదరాబాద్ వేదికగా ఓ భారీ సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. సెట్ నిర్మాణం పూర్తి అయినప్పటికీ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. దీనికి కారణం హైదరాబాద్ లో విజృంభిస్తున్న కరోనానే. అతి తక్కువమంది పాల్గొన్న బుల్లి తెర సీరియల్స్ నటులకే ఈ వ్యాధి సోకడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ లాంటి మూవీ షూటింగ్ ఎంత పరిమితులకు లోబడి నిర్వహించినా రిస్క్ ఎక్కువని భావిస్తున్నారు. ఈ విషయంలో రాజమౌళికి ఏమీ పాలుపోక కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. ఐతే ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా లేరని తాజా సమాచారం. మహమ్మారి వ్యాప్తి చెందుతున్న వేళా… షూటింగ్ లో పాల్గొనడం అంత సేఫ్ కాదనేది వారి ఆలోచనట. ఈ పరిణామాలు చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మరింత లేటు అయ్యేలా కనిపిస్తుంది.