ఉప్పందుకున్న ‘రౌడీ’ ప్రమోషన్లు

rowdy
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు మరియు మంచు విష్ణులు కలిసి నటిస్తు, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘రౌడీ’. అందరు ఎదురుచూస్తున్న ఈ రామ్ గోపాల్ వర్మ సినిమా ఏప్రిల్ 4న విడుదల కానుంది.

‘రౌడీ’ ట్రైలర్స్ కి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. విడుదలకు ఇంకా కొన్ని రోజులే ఉనందున, ఈ సినిమా నటి నటులు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో మునిగి పోయారు.

ఈ మేరకు డాక్టర్ మోహన్ బాబు మరియు మంచు విష్ణులు, ఈ సాయంత్రం హైదరాబాద్ లోని మల్లిఖార్జున ధియేటర్ లో మీడియా మరియు అభిమానులతో మాట్లాడనున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాలో జయసుధా మరియు శాన్విలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Exit mobile version