ట్విట్టర్, ఫేస్ బుక్ లు అంతటా నేడు రామ్ గోపాల్ చేసిన రౌడీ సినిమా ట్రైలర్ మార్మోగిపోతుంది. విష్ణు ఈ ట్రైలర్ ని విడుదలచేసిన సమయం నుండి ఈ వీడియో ఒక వైరస్ లా పాకిపోయింది. చాలా మంది ప్రముఖులు ట్రైలర్ లో విజువల్స్ ని, పంచ్ డైలాగులను మెచ్చుకున్నారు
మోహన్ బాబు నటించిన సీరియస్ సినిమాలలో ఒకటికావడం, ఆయన డైలాగ్ డెలివరీఫై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం గమనార్హం. జయసుధ, సన్వి నటించిన ఈ సినిమాలో మోహన్ బాబు ఒక పవర్ ఫుల్ ఫ్యాక్షనిష్ట్ గా కనిపించనున్నాడు. 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వారి సహాయంతో పార్థసారధి, గజేంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకానుంది