వెరైటీగా విడుదలవుతున్న రొటీన్ లవ్ స్టొరీ ఆడియో

వెరైటీగా విడుదలవుతున్న రొటీన్ లవ్ స్టొరీ ఆడియో

Published on Oct 16, 2012 7:00 PM IST


సందీప్ కిషన్, రేజీన జంటగా తెరకెక్కిన ‘రొటీన్ లవ్ స్టొరీ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవల ట్రైలర్ లాంచ్ చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి ప్రయత్నం ‘ఎల్బీడబ్లూ’ తో లవ్ స్టొరీని డిఫరెంట్ గా చూపించిన ప్రవీణ్ సత్తారు రెండో ప్రయత్నం రొటీన్ లవ్ స్టొరీ. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో వెరైటీగా విడుదల చేస్తున్నారు.సినిమాలోని ఒక్కో పాటని ఒక్కో రోజు ఒక్కో డిఫరెంట్ లోకేషన్లలో విడుదల చేస్తున్నారు. మొదటి పాటను సోమ వారం రేడియో మిర్చి స్టేషన్లో విడుదల చేయగా రెండవ పాటను టీవీ 9 స్టూడియోలో మంచు లక్ష్మి చేతుల మీదుగా విడుదల చేసారు. మూడవ పాటను మంచు మనోజ్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. చివరగా అక్టోబర్ 20న ఐదవ పాటని విడుదల చేస్తారు. వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాని మని కుమార్, చాణక్య బూనేటి నిర్మించారు.

తాజా వార్తలు