మోగ్లీ గ్లింప్స్ : ప్రేమ కోసం యుద్ధం అనివార్యం..!

Mowgli

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం ‘మోగ్లీ’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రోషన్ కనకాల హీరోగా నటిస్తుండగా సాక్షి మధోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ‘మోగ్లీ’ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు మేకర్స్. ఓ ప్రేమ కథ లో తాను ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమికుడు ఎంత దూరం అయినా వెళ్తాడు అనేది ఈ సినిమాలో మనకు చూపించబోతున్నారు. ఇక ఈ సినిమా కథ పూర్తిగా అడవి నేపథ్యంలో సాగుతుందని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.

ఈ సినిమాలో రోషన్ కనకాల పర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా ఉండబోతుందని ఈ గ్లింప్స్‌తో శాంపిల్ చూపెట్టారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బండి సరోజ్ కుమార్ నటిస్తుండటంతో ఈ పాత్ర పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version