టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నేడు(ఆగస్ట్ 29) 66 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఇక ఆయన రీసెంట్‌గా రజనీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంలో సైమన్ పాత్రలో నటించి మెప్పించాడు. అంతేగాక, తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేందుకు నాగ్ రెడీ అవుతున్నారు.
అయితే, ఈ క్రమంలో నాగ్ కెరీర్‌లో ఆయన నటించబోయే నెక్స్ట్ చిత్రం 100వ చిత్రం అవుతుండటంతో అక్కినేని అభిమానులతో పాటు సినీ లవర్స్‌లో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. కాగా, నాగ్ కెరీర్‌లో మరికొన్ని మైల్ స్టోన్ చిత్రాలపై కూడా వారు ఆరా తీస్తూ నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. నాగార్జున కెరీర్‌లో తొలి మైల్‌స్టోన్ 25వ చిత్రంగా ‘జైత్రయాత్ర’ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని ఉప్పలపాటి నారాయణ రావు డైరెక్ట్ చేయగా ఈ చిత్రం 1991 నవంబర్ 13న రిలీజ్ అయింది.
ఇక నాగ్ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ 50వ చిత్రంగా వైవిఎస్ చౌదరి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సీతారామరాజు’ రిలీజ్ అయింది. ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ మరో హీరోగా నటించడం విశేషం. ఈ చిత్రం 1999 ఫిబ్రవరి 5న రిలీజ్ అయింది.
నాగార్జున సినీ కెరీర్‌లో 75వ చిత్రంగా దర్శకుడ వీరూ పోట్ల తెరకెక్కించిన ‘రగడ’ రిలీజ్ అయింది. ఈ చిత్రం 2010 డిసెంబర్ 24న రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు నాగ్ తన కెరీర్‌లో మరో మేజర్ మైల్‌స్టోన్ 100వ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఆర్ఎ కార్తిక్ డైరెక్ట్ చేయనున్నారు. మరి మీలో ఎంతమందికి నాగ్ కెరీర్‌లోని ఈ మైల్‌స్టోన్ చిత్రాలు గుర్తున్నాయో కామెంట్ చేయండి.