ప్రస్తుతం మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా ‘ఓజి’ మేనియా నడుస్తుంది. యూఎస్ మార్కెట్ ఓజి రెస్పాన్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ నుంచి మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఈ రెండు సినిమాలపై డబుల్ బ్లాస్టింగ్ ట్రీట్ ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి వస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఓజి నుంచి ఒక సాలిడ్ యాక్షన్ టీజర్ కట్ లాంటిది ప్లాన్ చేస్తుండగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఇదే తరహాలో ట్రీట్ ని మేకర్స్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తుంది.
మరి వచ్చేవి ఏది అయినప్పటికీ రెండు ట్రీట్ లు మాత్రం ఖాయమట. సో ఇంకొన్ని రోజులు ఆగితే పవన్ అభిమానులకి పండగే అని చెప్పొచ్చు. ఇక ఓజి సినిమాని పవన్ ఫ్యాన్ బాయ్ సుజీత్ తెరకెక్కించగా డీవీవీ వారు నిర్మాణం వహించారు. అలాగే ఉస్తాద్ ని మరో ఫ్యాన్ బాయ్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.