తన విలక్షనమైన నటనా శైలి తో, చక్కటి గొంతు తో పేరు తెచ్చుకున్న నటి రోహిణి, ఇప్పుడు ఒక అరుదైన ఘనత సాదించింది. ఆమె దర్శకత్వం వహించిన “అప్పావిన్ మీసై” సినిమా ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైంది .
“అప్పావిన్ మీసై” సినిమాలో నిత్యామీనన్, నాజర్, పశుపతి , ప్రదాన పాత్రలు పోషించగా, ప్రముఖ దర్శకుడు చేరన్ ఈ సినిమాని నిర్మించారు. ఆల్ఫోన్సె రాయ్, సినిమాటోగ్రఫీ అందించగా, రసూల్ పూకుట్టి సౌండ్ విభాగం లో పనిచేసారు .
‘అలా మొదలయింది’, ‘ఇష్క్ ‘ , ‘ అంతకు ముందు ఆ తర్వాత’ తదితర సినిమాలలో తన నటన తో పేరుతెచ్చుకున్నారు రోహిణి .
ఈ సందర్భం గా 123 తెలుగు.కామ్ రోహిణి కి అభినందనలు తెలుపుతుంది .