రాకీ భాయ్ వర్సెస్ అధీరా..రోమాలు నిక్కబొడుస్తాయట.!


మన దక్షిణాది నుంచి వచ్చిన కేజీయఫ్ సినిమా కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని తర్వాత రానున్న చాప్టర్ 2 కోసం ఎంతో మంది ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొత్తం మాస్ ఆడియన్స్ కు ఒక ఫీస్ట్ లా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించడంతో ఎనలేని అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాలో మోస్ట్ పవర్ ఫుల్ లీడ్ రోల్ రాకీ భాయ్ గా కన్నడ రాకింగ్ స్టార్ యాష్ ఇచ్చిన ఔట్ ఫుట్ మాములు రేంజ్ ఇంపాక్ట్ కలిగించలేదు. అలాగే మరోపక్క అంతే స్థాయిలో మరో పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ అధీరాను ఇటీవలే చిత్ర యూనిట్ పరిచయం చేసారు.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను అధీరాగా పరిచయం చేసిన ఈ లుక్ ఒక సరికొత్త రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఇప్పటికే రాకీ భాయ్ మరియు అధీరాల నడుమ ఉండే యాక్షన్ సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయని యాష్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
అందుకు తగ్గట్టుగానే ఇప్పుడొక ఆసక్తికర అంశం తెలిసింది.

సంజయ్ దత్ ను ప్రశాంత్ నీల్ కనీ వినీ ఎరుగని రేంజ్ లో చూపించనున్నారని అలాగే యష్ మరియు సంజయ్ ల నడుమ డిజైన్ చేసిన భీకర పోరాట సన్నివేశాలు వెంట్రుకలు నిక్కబొడిచే విధంగా ఉంటాయట. అలాగే ముఖ్యంగా క్లైమాక్స్ లో వీరిద్దరి మధ్య ఒక సీన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందట. ప్రస్తుతానికి మేకర్స్ ఈ చిత్రానికి ఒక సరికొత్త డేట్ కోసం వెతుకుతున్నారు.

Exit mobile version