రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీకి బ్రేక్ పడినట్లేనా?


మెగా అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీకి ప్రస్తుతం బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం అలనాటి హిట్ చిత్రం జంజీర్ రిమేక్లో నటించడానికి రామ్ చరణ్ రంగం సిద్ధం చేసుకోగా ఆ ప్రాజెక్టు ఇప్పుడో సమస్యల్లో పడింది. ఈ స్క్రిప్ రచయితలైన సలీం ఖాన్ మరియు జావేద్ అక్తర్ ఈ రిమేక్ చేయడానికి అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. సలీం ఖాన్ మాట్లాడుతూ జంజీర్ సినిమాని రీమేక్ చేస్తున్నట్లు మాకు తెలియదు. ఈ విషయం మా లాయర్ ద్వారా సంప్రదించగా ఎవరూ స్పందించ లేదు. జావేద్ అక్తర్ మాట్లాడుతూ ఈ విషయం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపినట్లు సమాచారం.

Exit mobile version