రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ అద్భుత విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి రిషబ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. ‘20 ఏళ్ల క్రితం మా గ్రామంలో జరిగిన ఓ సంఘటన కాంతార కథ ఐడియా వచ్చింది. అప్పట్లో, వ్యవసాయ భూమి కోసం ఒక అటవీ అధికారికి, రైతుకు మధ్య ఘర్షణ జరిగింది. దాన్ని నేను ఇద్దరు మనుషుల మధ్య ఘర్షణగా చూడలేదు. ప్రకృతిని కాపాడే వారి మధ్య ఘర్షణగా చూశాను. ఆ అంశమే నాకు చాలా ఏళ్లు గుర్తు ఉండి పోయింది’ అని రిషబ్ చెప్పుకొచ్చారు.
రిషబ్ ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమాల్లోకి వచ్చాక, ఆ అంశంతోనే కథ రాయాలని నిర్ణయించుకున్నాను. మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం ప్రారంభించాను. ఇక ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని, షూట్ చేసే సమయంలోనే అనిపించింది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథ. ఇలాంటివి ఎప్పుడూ ఆదరణను సొంతం చేసుకుంటాయనే నా నమ్మకం మరోసారి నిజమైంది’ అంటూ రిషబ్ తెలిపారు.