
తన మీద వచ్చిన పెళ్లి గురించిన పుకార్లను విని రిచా గంగోపాధ్యాయ్ అవాక్కయ్యారు. పలు వెబ్ సైట్లలో ఫోటోగ్రాఫర్ సుందర్ రాముతో గత కొద్ది రోజులుగా తనకి సంభంధం ఉందని పుకార్లు కనిపించాయి వీటన్నింటినీ రిచా ఖండించింది ఒకానొక ప్రముఖ పత్రిక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవట్లేదు వాళ్ళు స్నేహితులు మాత్రమే ప్రస్తుతం రిచా పెళ్లి గురించి ఆలోచించట్లేదు అని ప్రచురించింది. ఇదిలా ఉండగా రిచా తెన్ కాశిలో జరుగుతున్న ప్రభాస్ “మిర్చి” చిత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో నాగార్జున “భాయ్” చిత్ర చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. ఈ రెండు చిత్రాలు కాకుండా రిచా, రవితేజ “సార్ వచ్చారు” చిత్రంలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ చిత్రం “ఇద్దరమ్మాయిలతో” నుండి తప్పుకోవడం ఇప్పుడు ఇలాంటి పుకారు రావడం ఆమె ఈ వారం ఆమెకి కలిసి వచ్చినట్టు లేదు.