యామిని మరియు వినమ్రలని కలిపితే వసుధ – రిచా గంగోపాధ్యాయ్


మాస్ మహారాజ రవితేజ హీరోగా “ఆంజనేయులు” ఫేం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సార వస్తారు”. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా రిచా గంగోపాధ్యాయ్ రెండవ కథానాయికగా నటిస్తున్నారు. గతంలో ఈ చిత్రానికి “సార్ వస్తారా?” అనే పేరుని పరిశీలించగా తాజాగా “సార వస్తారు” అనే పేరు ఖరారు అయ్యింది. ఈ మధ్యనే ఈ చిత్రం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంది ప్రస్తుతం ఊటీలో రవితేజ మరియు రిచా గంగోపాధ్యాయ్ ల మధ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి రిచా మాట్లాడుతూ ” ఈ చిత్రం “వసుధ” పాత్ర యామిని (మయక్కం ఎన్న) మరియు వినమ్ర(మిరపకాయ్) పాత్రలను కలబోసినట్టు ఉంటుంది.ఊటీ సెట్ లో చాలా ఆహ్లాదంగా ఉంది. ఈ పాత్రలో అన్ని అంశాలున్నాయి కొన్ని ముఖ్యమయిన సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నాను. మీకు నా ప్రదర్శన నచ్చుతుందనే అనుకుంటున్నాను”అని ట్విట్టర్లో అన్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Exit mobile version