ఆంద్రప్రదేశ్ రౌడీలపై సెటైర్ వేసిన రాంగోపాల్ వర్మ

ఆంద్రప్రదేశ్ రౌడీలపై సెటైర్ వేసిన రాంగోపాల్ వర్మ

Published on Sep 16, 2013 5:30 PM IST

rgv
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మ తన సినిమాల కోసం దేనినైన, ఎవ్వరినైన వాడుకొని ప్రజలలో పాపులారిటి సంపాదిస్తాడు. ఈయన ప్రతి దానిపై వివాదాస్పదమైన స్టేట్ మెంట్స్ చేసి ఈయన ప్రాజెక్ట్ కు ఉపయోగపడేలా చేసుకుంటాడని సమాచారం. అలాగే తను తాజా చిత్రం ‘సత్య 2’ లో ఆంధ్ర ప్రదేశ్ రౌడీలను, ఫ్యాక్షనిస్ట్ లను టార్గెట్ చేశాడు. ప్రజలకోసం ‘సత్య 2’ ఆడియో ఫంక్షన్ లో విడుదల చేయడం జరిగింది. దానితో పాటుగా ఈ వ్యాఖ్యలను కూడా పోస్ట్ చేశాడు. ” సీమ ఫ్యాక్షనిస్ట్ లు నశించారు కనుక, విజయవాడ రౌడీలు దిక్కులేకుండా పోయారు కనుక, హైదరాబాద్ గూండాలు ఇంకేమి దొబ్బించుకోలేరు కనుక ‘సత్య 2’ వస్తోంది”అన్ రాయడం జరిగింది. ‘సత్య 2’ ఆడియోని ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకకి రాజమౌళి, ప్రభాస్ లు రానున్నారని అలాగే పూరి జగన్నాథ్ మరికొంత మంది ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. రాంగోపాల్ వర్మ పై రియాక్ట్ అవుదామంటే మాకు సీమ ఫ్యాక్షనిస్ట్ లు, విజయవాడ రౌడీలు, హైదరాబాద్ గూండాలా గురించి తెలియదు. కానీ ఈ పదాలు ఎవరిని భాదించలేదని మా నమ్మకం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు