మద్యం దుకాణాల్లో “వోడ్కా విత్ వర్మ”

మద్యం దుకాణాల్లో “వోడ్కా విత్ వర్మ”

Published on Dec 17, 2012 4:50 PM IST

vodaka-with-varma
రామ్ గోపాల్ వర్మ మీద ప్రముఖ విమర్శకుడు సిరాశ్రీ రచించిన “వోడ్కా విత్ వర్మ” పుస్తకం హైదరాబాద్లో ఊహించని ప్రదేశాల్లోకి వెళుతుంది. గత వారం విడుదలయిన ఈ పుస్తకం టైటిల్ పలు వైన్ షాప్ ఓనర్లను ఆకట్టుకున్నట్టు కనిపిస్తుంది. కొన్ని మద్యం దుకాణాలలో ఈ పుస్తకాన్ని అమ్ముతున్నారు ఆశ్చర్యపోకండి ఇది అక్షరాలా నిజం. దీని గురించి రాంగోపాల్ వర్మ ఫోటో పెడుతూ ఇలా చెప్పారు. “వోడ్కా విత్ వర్మ పుస్తకాన్ని మద్యం దుకాణాల్లో అమ్ముతున్నారంట” అని ట్వీట్ చేశారు. ఇలాంటి పద్ధతిలో పుస్తకాన్ని అమ్మడం ఇదే మొదటిసారి అయ్యుండచ్చు. గతంలో రామ్ గోపాల్ వర్మ రచించిన “నా ఇష్టం” పుస్తకం ప్రేక్షకుల్లో మంచి స్పందన దక్కించుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు