మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నతించిన రౌడి సినిమా ఈ నెల 28న భారీ విడుదలకు సిద్ధంగా వుంది. ఈ మాస్ యాక్షన్ డ్రామాను రాయలసీమ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. చాలా కాలం తరువాత మోహన్ బాబు, విష్ణు సీరియస్ పాత్రలో నటించారు
విష్ణు, శన్విల మీద తెరకెక్కించిన ‘నీ మీద ఒట్టు’ అనే రొమాంటిక్ పాటను కొంతసేపటి క్రితమే రామూ విడుదలచేసారు. ఈ వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో బాగా షేర్ అవుతుంది. రాము చివరి సినిమా సత్య 2 అట్టర్ ఫ్లాప్ అయినా ఈ సినిమాపై భారీగానే అంచనాలు వున్నాయి. నిజానికి మన రాముకి ఇది కమ్ బ్యాక్ ఫిలిం అనికూడా అంటున్నారు
సాయి కార్తీక్ సంగీతదర్శకుడు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్. విజయ్ కుమార్, గజేంద్ర నాయుడు మరియు పార్థసారధి నాయుడు ఈ సినిమాకు నిర్మాతలు