రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే మోహన్ బాబు, మంచు విష్ణు లతో సినిమా తియ్యాలని వుందని చెప్పాడో అప్పట్నుంచి రామూకి హిందీలో కంటే తెలుగులో తీయడానికి ఆసక్తి అని పలు పుకార్లు వచ్చాయి. ఇంకా రామూ ఏ విషయమూ చెప్పలేదు. కేవలం కొంతమంది తెలుగు నటులతో సంప్రదింపులు జరుగుతున్నాయి
ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే రాము,రాజశేఖర్ తో కలిసి పనిచెయ్యనున్నాడు. వీరిద్దరూ ఇటీవలే కలిసి చర్చించుకున్నారు. ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నారట. అన్నీ సక్రమంగా జరిగితే ఈ ఏడాదే సినిమా మొదలవుతుందని అంచనా
మరోపక్క రాజశేఖర్ ఈ మధ్య వెండితెరపై కనిపించిన దాఖలాలులేవు . చివరిగా ‘మహంకాళి’ సినిమాలో కనిపించిన అతను నటించిన మరికొన్ని సినిమాలు విడుదలవ్వనున్నాయి