సత్యకి సీక్వెల్ తీస్తున్న వర్మ

సత్యకి సీక్వెల్ తీస్తున్న వర్మ

Published on Dec 18, 2012 7:37 AM IST

ram-gopal-varma
వివాదాల విలక్షణ దర్శకుడు వర్మ మరో సీక్వెల్ తీస్తున్నాడు. 1988లో తను తీసిన సత్య సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాతోనే మనోజ్ బాజ్పాయ్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇప్పుడు సత్య సినిమాకి సీక్వెల్ గా ‘సత్య 2’ సినిమాని తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 20% పూర్తయింది. ఈ సినిమాని ముంబై అండర్ వరల్డ్ మాఫియా నేపధ్యంగా చిత్రీకరిస్తున్నాడు. సత్య 2లో కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేయనున్నాడు. 1998లో వచ్చిన సత్య సినిమానే వివాదాలకి కేంద్ర బిందువు అయింది. ఇప్పుడు ఈ సత్య 2 ఎన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి మరి. వర్మ ఇదే కాకుండా 26/11 ముంబై పై దాడి, సర్కార్ 3 సినిమాలు కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. 26/11 ముంబై దాడి సినిమా షూటింగ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు