ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని లాంచ్ చేసాడో అప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ సినిమాలతోనే కాకుండా రాజకీయాలతో కూడా బిజీ అయ్యాడు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలి అనుకున్న వర్మ, వచ్చాక ఆయన్ని కొన్నిసార్లు పొగిడితే కొన్ని సార్లు విమర్శించారు. ముఖ్యంగా పవన్ రాసిన ‘ఇజం’ బుక్ బాలేదని అన్నాడు.
ఇందులో భాగంగా వర్మ పవన్ కళ్యాణ్ కి ఓపెన్ గా ఓ లెటర్ రాసాడు. ఇందులో వర్మ ఇజం బుక్ ని అర్థం కాని బుక్ అనడమే కాకుండా పవన్ మిత్రుడు రాజు రవితేజ అతన్ని పక్కదారి పట్టిస్తున్నాడని తెలిపాడు. మంచి రీడర్ అయిన వర్మ ఎంతో మంది గ్రేట్ ఫిలాసఫర్స్ రాసిన బుక్స్ తో ఇజంని పోల్చలేను అంటున్నాడు.
అందులోనే వర్మ పవన్ కళ్యాణ్ ని బ్రూస్ లీతో పోల్చాడు. అలాగే అతన్ని వేరేవాళ్ళ వల్ల మారవద్దని చెప్పాడు. ‘బ్రూస్ లీ ఒక పని చేయాలి అనుకుంటే దానిపైన తీవ్రంగా దృష్టి సారించే వాడు అలాగే ఎంతో చిత్తసుద్దిగా ఉండేవాడు. ముఖ్యంగా వేరేవాళ్ళు చెప్పే మాటలకి అసలు వినేవాడు కాదు అందుకే బ్రూస్ లీకి ఓ ప్రత్యేకత ఉంది. అలాగే మీరు కూడా మీరు చెప్పాలనుకున్నది మీ స్టైల్ ఫిలాసపీలో చెప్పండని’ వర్మ పవన్ కళ్యాణ్ కి సూచనలు ఇచ్చాడు.