ఓల్డ్ సిటీపై దృష్టి పెట్టిన వర్మ, పూరి

rgv_puri
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలిసి ఓ కొత్త సినిమా కోసం భారీగా ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ఏరియాని చుట్టొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ చార్మినార్ ఏరియాలో ఓ సినిమా కోసం ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం.

మాకు అందిన సమాచారం ప్రకారం రామ్ గోపాల్ వర్మ ఇక్కడికి వెళ్ళడానికి ముందు పోలీసులను కూడా కలిసి ఈ టూర్ గురించి చర్చించారు. కానీ అతను ఎందుకు పోలీసులని కలిసాడు అనే దాని మీద కచ్చితమైన సమాచారం లేదు కానీ ఫిలిం నగర్ వర్గాలు మాత్రం హైదరబాద్ లోని టెర్రర్ నెట్వర్క్స్ మీద సినిమా ఉంటుందని అంటున్నారు.

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం డా. మోహన్ బాబుతో చేస్తున్న షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

Exit mobile version