ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో పలుభాషల్లో 14 వివిధ చిత్రాలు చిత్రీకరణతో సందడిగా ఉంది. “నాయక్”, “సార్ వచ్చారు”, “వసూల్ రాజ”, “రంగ్రేజ్”, “మధ గజ రాజ” , మూడు బెంగాలి చిత్రాలు మరియు ఇతర చిత్రాలు ఇక్కడ చిత్రీకరించబడుతున్నాయి. ఇక్కడ ఇలా ఇన్ని చిత్రాలు ఒకేసారి చిత్రీకరణ జరుపుకోవడం కొత్తేమి కాదు కాని ఆసక్తికరమయిన విషయం ఏంటంటే తారలు వారి స్నేహితులను కలుసుకోగలగడం. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లీడర్” చిత్రంలో కలిసి నటించిన రిచా గంగోపాధ్యాయ్ మరియు ప్రియా ఆనంద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నారు. “రంగ్రేజ్” చిత్రం కోసం ప్రియ మరియు “సార్ వచ్చారు” చిత్రం కోసం రిచా ఇక్కడ ఆన్నారు ఇద్దరు కలవడానికి ఇదొక మంచి అవకాశంగా మారింది. ఇదిలాఉండగా కుష్బూ “రంగ్రేజ్” సెట్ లో ప్రియదర్శన్ మరియు ప్రియ ఆనంద్ లను కలవడమే కాకుండా “నాయక్” సెట్ కి వెళ్లి అమలపాల్ ని కూడా కలిసారు. “వసూల్ రాజ” చిత్రంలో ఐటం సాంగ్ చిత్రీకరణ కోసం నవదీప్ ఈరోజు రామోజ్ ఫిలిం సిటీ చేరుకున్నారు.